మునుగోడు పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల హాస్టల్ ను శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం వండిన అన్నాన్ని, కూరలను, సాంబారు, పెరుగును స్వయంగా రుచి చూసి పరిశీలించారు. అన్నం మాడిపోవడంతో వంట తయారీ ఏజెన్సీ వై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, పెరుగు ఎక్కడి నుండి వస్తున్నాయని పెరుగు ఇంత పుల్లగా ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు.