ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తప్పించుకునేందుకే ఐటీ దాడులు

బీజేపీ కేంద్ర పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని అందుకే తెలంగాణ మంత్రులపై కేంద్రప్రభుత్వం ఐటీ దాడులు చెపిస్తుందని టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు బొల్ల ప్రవీణ్ విమర్శించారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరుకాకుండా దర్యాప్తు సంస్థలను కించపరిచేలా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉచ్చు బిగుస్తుండడంతో బీజేపీ తమ బండారం బయటపడుతుందని, టీఆర్ఎస్ పార్టీ మంత్రులను బెదిరించేలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఐటీ దాడులు చేస్తోందని, ఇలాంటి దాడులకు టీఆర్ఎస్ సైనికులు ఎవ్వరూ బయపడరని, టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే బీజేపీ ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఇలాంటి చర్యలు మానుకొని సిట్ ఎదుట ముందుగా బీఎల్ సంతోష్ హాజరై నిజానిజాలు నిగ్గుతేల్చాలని లేకుంటే యావత్ తెలంగాణ ప్రజలు మున్ముందు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.