తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశానికే తలమానికంగా మారుతుందని బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు బొల్ల ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంథ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా ఇంకా చాలా మంది ప్రముఖులు హాజరుకానున్నారని, ఖమ్మం సభతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయనున్నారని, ఈ సభకు మునుగోడు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.