నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాల్లు, విద్యార్థులు పాఠశాల మైదానంలో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి రంగు రంగులతో, ఆటపాటలతో, విద్యార్థుల హరిదాసు వేషాధారణతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు.