నాంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన భూదాత కర్నాటి పార్వతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి బీసీ సంక్షేమ జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఆమె చిత్రపటానికి శనివారం పూలమాలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించారు. అనంతరం ఆయన మండల కేంద్రంలో ప్రసంగించారు. బీసీలు రాజ్యాధికారం వైపు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పానగంటి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.