మునుగోడు తొలి మాజీ ఎంపీపీ, స్వాతంత్ర్య సమరయోధుడు మాదిరెడ్డి యాదగిరి రెడ్డి ఇటీవల మరణించిన విషయం విదితమే. కాగా, మునుగోడు మండలం యాదగిరి రెడ్డి స్వగ్రామమైన కొరటికల్ లో శనివారం వారి కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. వారి వెంట నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఇరువురు యాదగిరి రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.