మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వామి వారి అగ్నిగుండాలు, రథోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బొల్ల వెంకటేశం, గ్రామ పురోహితుడు వై శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.