నాంపల్లి మండలంలోని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మోడల్ స్కూల్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయులకు శుక్రవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళ లోకానికి ఒక దిక్సూచి లాగా దారి చూపిందన్నారు.