మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో నెలకొని ఉన్న కరెంటు సమస్యలను గుర్తించి నివేదిక ఇవ్వాలని స్థానిక ముఖ్య నాయకులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ సీఎం డి ముషారఫ్ తో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి సమావేశమైన అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొని వున్న కరెంటు సమస్యలు తీర్చాలని కోరారు. తక్షణమే మండల కేంద్రాలలో ఉన్న కరెంటు ఇబ్బందులను వెంటనే గుర్తించి నివేదిక ఇవ్వాలని వెను వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.