హాలియా: మాల మహానాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్

58చూసినవారు
హాలియా: మాల మహానాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్
హాలియా గెస్ట్ హౌస్ లోని మాల మహానాడు ముఖ్య కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు మధుబాబు హాజరైయ్యారు. ఈ సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆదేశాల మేరకు మాల మహానాడులో క్రియాశీలకంగా పనిచేయుచున్న అనంత రాములుని మాల మహానాడు, మాల ఉద్యోగుల నియోజకవర్గ కోఆర్డినేటర్ గా, మాల మహానాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ని శనివారం ఎన్నుకొన్నారు.

సంబంధిత పోస్ట్