భూ భారతి చట్టం అమలుతో భూములకు భద్రత లభిస్తుందని నల్గొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. గురువారం మండలంలోని వెనిగండ్ల గ్రామంలో రెవెన్యూ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధరణి చట్టంలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, రైతాంగానికి మేలు చేసేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తుందని, భూ యజమానులు సమస్యలపై ధరఖాస్తులు సమర్పించి పరిష్కరించుకోవాలన్నారు.