మాడుగులపల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

67చూసినవారు
మాడుగులపల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పూసలపాడు గ్రామానికి చెందిన సంకోజు లక్ష్మమ్మ భర్త నారాయణ ప్రైవేట్ హాస్పిటల్లో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చేపూరి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 28 వేల రూపాయల చెక్కు మంజూరు చేశారు. ఆ చెక్కును మంగళవారం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.

సంబంధిత పోస్ట్