తిరుమలగిరి మండలం రాజవరం గ్రామంలో సౌడమ్మ మరియు లింగమంతుల పండుగ సందర్భంగా గుడిని దర్శించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ ప్రజలలో మమేకమై డప్పులు కొడుతూ అందరి మనసుల్లో నిలిచారు. కార్యక్రమంలో కర్నాటి లింగారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు యడవల్లి వల్లభ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గడ్డం సాగర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేకర్, మండల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.