నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ గిరిజన, ఆదివాసి ప్రతినిధుల శిక్షణ తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరగనున్న శిక్షణ తరగతులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత జానారెడ్డిలు ప్రారంభించారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఆదివాసీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని పీసీసీ చీఫ్ అన్నారు.