నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో ఆటోల దోపిడీకి అంతులేకుండా పోయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టపైకి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోల డ్రైవర్లు భక్తుల నుంచి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఒక్కో భక్తుడి వద్ద గుట్ట పైకి వెళ్లడానికే రూ.20ల ఛార్జి తీసుకున్నారని వారు చెబుతున్నారు. ఆటోలపై అధికారుల నియంత్రణ లేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.