ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో నల్గొండ జిల్లాకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా అధికారులు, సిబ్బంది పని చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆమె జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.