నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్ గా తీర్చిదిద్దుతాం

82చూసినవారు
నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్ గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇక్కడి వాతావరణం, నీటి వసతులు, నూతన పంటల సాగు , వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ ను వ్యవసాయ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా త్రిపురారం మండలం, కంప సాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫాక్స్ నట్ మఖాన ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్