చిట్యాల: మహిళా అభ్యున్నతికి కృషి చేసిన మార్గదర్శి అంబేద్కర్

52చూసినవారు
చిట్యాల: మహిళా అభ్యున్నతికి కృషి చేసిన మార్గదర్శి అంబేద్కర్
చిట్యాల మున్సిపల్ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో సోమవారం సీపీఎం, కాంగ్రెస్, ఎంఆర్పీఎస్, బీజేపీ, బీఆర్ఎస్, కెవిపియస్ ల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉన్నదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.

సంబంధిత పోస్ట్