చిట్యాల మున్సిపల్ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలోని ప్రభుత్వ భూమిని అర్వులైన పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శివనేనిగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 3లో 18. 12 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని శుక్రవారం వారు సీపీఎం గ్రామ శాఖ సభ్యులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.