చిట్యాల: అర్హులైన పేదలందరికీ ఇండ్లు పంపిణీ చేయాలి

79చూసినవారు
చిట్యాల: అర్హులైన పేదలందరికీ ఇండ్లు పంపిణీ చేయాలి
చిట్యాల మండల కేంద్రంతో పాటు వట్టిమర్తి గ్రామాలలో ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి  శనివారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి నిరుపేదలు ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తూ ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా పేదవాళ్ళ సొంత ఇల్లు కళ పాలకులు నెరవేర్చలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్