చిట్యాలలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిపే వర్క్ హాలిడే కార్యక్రమానికి సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ మద్దతు తెలిపారు. చిట్యాలలో ఆదివారం ప్రారంభం అయిన వర్క్ హాలిడే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, పీఓపి, ప్లంబర్, టైల్స్, మార్బుల్స్ వంటి వర్కర్స్ రేట్లను భవన నిర్మాణ కాంట్రాక్టులు, తదితరులు పెంచాలని కోరారు.