చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రీడలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేశ బోయిన స్వరూప నరసింహ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులను అభినందించారు.