చిట్యాల: రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి

76చూసినవారు
చిట్యాల: రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి
చిట్యాల మండల కేంద్రంలో సోమవారం స్థానిక మేకల లింగయ్య స్మారక భవనంలో జరిగిన రైతు సంఘం మండల మహాసభకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ, రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం వాన కాలం, యాసంగి రెండు కార్లకు రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్