ధరణి పోర్టల్ లో అన్ని మాడ్యూల్స్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కట్టంగూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్ ను పరిశీలించారు. పోర్టల్ లో వివిధ మాడ్యూల్స్ కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను, ఫైళ్లను ఆమె పరిశీలించి తహసిల్దార్ ప్రసాద్ కు, సిబ్బందికి తగు సూచనలు చేశారు.