డ్రైనేజీ పూడిక తీయకపోవడంతో విపరీతమైన దోమల బెడద

685చూసినవారు
డ్రైనేజీ పూడిక తీయకపోవడంతో విపరీతమైన దోమల బెడద
కట్టంగూరు మండలంలోని గ్రామంలో పలు వార్డులలో డ్రైనేజీ పూడిక తీయకపోవడంతో విపరీతమైన దోమలు మరియు దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. రెండో వార్డులో డ్రైనేజీ పక్కన చెట్లు పెరిగి నీళ్లు వెళ్లడానికి వీలు లేకుండా ఉండడంతో మురుగునీరు నిలిచిపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంది. దోమల మందు పిచికారి చేయమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఈ విషయమై స్థానిక సర్పంచ్ గారికి మరియు కార్యదర్శి గారికి ఎన్ని సార్లు తెలియజేసిన పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్