సీపీఎం పార్టీలో జయమ్మ సేవలు మరువలేనివి

78చూసినవారు
సీపీఎం పార్టీలో జయమ్మ సేవలు మరువలేనివి
చిట్యాల మండలం తాళ్ళవెళ్ళంల గ్రామంలో బుధవారం కామ్రేడ్ జయమ్మ వర్థంతి సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం చిట్యాల మండల కమిటీ సభ్యురాలు, ఐద్వా మాజీ మండల కమిటీ అధ్యక్షురాలు పామనుగుళ్ళ జయమ్మ సేవలు మరువలేనివని సీపీయం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్