ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీపీఎం పార్టీ కట్టంగూర్ మండల నాయకులు పాదయాత్ర చేపట్టారని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శనివారం ఈదులూరు గ్రామంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో పాలకులు మారినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.