చిట్యాల కూరగాయల మార్కెట్ లో గల మూత్రశాలల నిర్వాహణ పడకేసింది. మూత్రశాలల వద్ద చెట్లు పెరిగి దుర్గంధం వెదజల్లుతుంది. నిత్యం వందల మంది స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుండి కూరగాయలు కొనుగోలు చేయటానికి ఇక్కడికి వస్తారు. కానీ వారు వాటిని ఉపయోగించుకొనే విధంగా లేవని విచారం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.