నకిరేకల్ పట్టణంలో మిషన్ పరివర్తనలో భాగంగా శనివారం రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానితులుగా తిరుగుతూ, తాగి డ్రైవ్ చేస్తున్న 129 మందిని విచారించి, 94 బైకులు, 9 కార్లు, 3 ఆటోలను, ఒక టాటా ఎస్ వాహనాన్ని సరైన పత్రాలు లేని కారణంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాoరెడ్డి, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.