చిట్యాల, గుండ్రాంపల్లి, వట్టిమర్తి గ్రామాలలో ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసి పట్టాలు ఇవ్వాలని, పేదలను గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు చిట్యాల తహశీల్దార్ ను కోరారు. సోమవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కృష్ణ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.