తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముందుగా ఆలయ అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ వారికి స్వాగతం పలికారు.