నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 9 వరకు నిర్వహించనున్నారు. స్వామి వారికి తలంబ్రాల బియ్యం సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.