చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు.