రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నూతనంగా నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కలెక్టరేట్లో నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.