ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

1491చూసినవారు
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మునుగోడు మండల కేంద్రములోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ & జడ్పిటిసి మునుగోడు నారబోయిన స్వరూపారాణి ,రవి ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించినారు. ఆనంతరం వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎంపి టి సి 1 బొడ్డు శ్రావణీ నాగరాజు గౌడ్ , మునుగోడు గ్రామ పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ పాలకుర్తి నర్సింహ , ఆర్ టి సి మాజీ రీజనల్ మేనేజర్ గోలి చెన్న కేశవులు , బి ఆర్ ఎస్ యువజన విభాగం మండల నాయకులు జంగిలి నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్