నల్గొండ జిల్లా కేంద్రంలోని శివరాం నగర్ సెంటర్లో 'అమ్మ మాట అంగన్వాడి బాట' కార్యక్రమాన్ని గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు.