రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పౌష్టికాహార పంపిణీ, పాఠశాల పూర్వ విద్య కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేందుకు
5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ దగ్గర్లోని అంగన్వాడి కేంద్రాలలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. “అమ్మ మాట అంగన్వాడి బాట” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడ 3 వ అంగన్వాడి కేంద్రం పరిధిలో చిన్న పిల్లలతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.