ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1600 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు అవుతున్న సందర్భంగా శనివారం తెలంగాణ విద్యావంతుల వేదిక, సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి 'అమరులకు స్మృతి దీపం' వెలిగించారు.