నల్గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కార్డెన్ నిర్వహించారు. పట్టణంలోని మాన్యంచెల్కలో సుమారు 500 ఇండ్లలో మాదక ద్రవ్యాలను పసిగట్టే స్నైపర్ డాగ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు రౌడి షీటర్లతో పాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరికి గంజాయి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా వచ్చింది. అలాగే పత్రాలు సక్రమంగా లేని 165 వాహనాలను, నాలుగు ఆటోలను సీజ్ చేశారు.