ఖాకీ సినిమా రేంజ్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి నిందితులను పట్టుకు వచ్చిన మిర్యాలగూడ పోలీస్. వివరాల్లో కెళ్తే నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నందు దొంగతనానికి పాల్పడిన మరికొంత మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15, 35, 000/- నగదు. (03) సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి కటకటాల పాలు చేశారు.