ఈనెల 15వ తేదీన చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో 22వ వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ గురువారం తెలిపారు. ఆ రోజున జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.