నల్గొండ: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

72చూసినవారు
నల్గొండ: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
తమ సమస్యలు పరిష్కంచాలని, మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26వేలు నిర్ణయించాలని డిమాం డ్‌ చేస్తూ శుక్రవారం నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర జేఏసీ డిసెంబర్‌ 27, 28 తేదీల్లో టోకెన్‌ సమ్మె పిలుపులో నిరసన వ్యక్తం చేశారు. అన్ని మండల కేంద్రాల్లో కార్మికులు ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్