నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్వాధీన పరచాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం దొడ్డి కొమరయ్య భవన్లో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ సీపీఎం ఆధ్వర్యంలో పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.