అన్ని గ్రామాలు, తండాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా మర్రిగూడ కార్యాలయంలో ఎంపీడీఓ, సంబంధిత అధికారులతో తాగునీరు, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకూడదని, అందువల్ల గ్రామాలు, తండాలలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.