
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ప్రస్తుతం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 20కి పైగా స్థానాల్లో BJP స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఆప్ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది.