నూతన రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఇందుకోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10, 07, 259 రేషన్ కార్డులు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలో వారి కల నెరవేరబోతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.