
హసీనాని కంట్రోల్ చేయాలని చూస్తే మోదీ అంగీకరించలేదు: యూనస్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దిల్లీ నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంపై మోదీతో చర్చించానని.. హసీనాను కంట్రోల్ చేయాలని కోరినప్పటికీ, మోదీ అంగీకరించలేదని బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ తెలిపారు. సోషల్ మీడియాను నియంత్రించడం సాధ్యం కాదని మోదీ చెప్పినట్టు యూనస్ లండన్లో ఓ సభలో వెల్లడించారు.