చేపల ప్రత్యుత్పత్తి కారణంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్, దిగువ ప్రాంతం, వాడపల్లి వరకు ఈనెల 1 నుండి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు చరిత ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల మత్స్యకారులు ఈ నెల 1 నుండి ఆగస్టు 31 వరకు పైన పేర్కొన్న నిర్దేశిత ప్రాంతంలో చేపల వేట చేయరాదని, ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి చేపల వేట కొనసాగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.