జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ మున్సిపల్ & జౌళి శాఖ మంత్రి
కేటీఆర్ ప్రకటించిన నిర్ణయాలపై మునుగోడు చేనేత సహకార సంఘం డైరెక్టర్ బొల్ల పరమేశం సోమవారం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో
జియో ట్యాగ్ కలిగి ఉన్న చేనేత కార్మికులకు చేనేత మిత్ర పథకం క్రింద నెలకు 3వేల రూపాయలను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలో వేస్తామని ప్రకటించారని ముఖ్యమంత్రి
కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.