నల్లగొండ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న మహా ధర్నా వాయిదా వేస్తున్నట్లు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.